ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల ఆకస్మతుగా మరణించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ కు నమ్మకస్తుడు, స్నేహితుడుగా ఉన్న గౌతమ్ రెడ్డి దూరం కావడం వైసీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి తీరని లోటను పలు సార్లు సీఎం జగన్ అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి గుర్తుగా సీఎం జగన్ ఒక మంచి కార్యక్రమం చేపడుతారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వచ్చాయి. కాగ ఈ వార్తలను నిజం చేస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజా గా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. నెల్లూర్ జిల్లాలో ఉన్న సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన.. సంగం బ్యారేజీని త్వరగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని మేకపాటి గౌతమ్ రెడ్డి అనుకున్నారు.
కానీ ఈ బ్యారేజీ పూర్తికాక ముందే ఆకాల మరణం పొందారు. కాగ ఈ సంగం బ్యారేజీని ఆరు నెలల్లో పూర్తి చేస్తానని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా.. సంగం బ్యాకేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టడంతో.. ఆయన అభిమానులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.