MAA ELECTIONS : ‘మా’ ఎన్నికల నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్

-

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం రేగింది. అయితే.. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికల నామినేషన్ వేశారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ప్రకాశ్‌ రాజ్‌ తో సహా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నామినేషన్‌ వేశారు శ్రీకాంత్.

ఇక నేటి నుంచి నుంచి 29 వరకూ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు.. అలాగే… ఈ నెల 30 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇచ్చారు ఎన్నికల అధికారి. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన చేయనున్నారు..
ఇక అక్టోబర్‌ 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికలు జరుగునుండగా… అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news