Thalapathy Vijay: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్.. ఆయనకు ఎంత ప్రేక్షకాదరణ ఉందో అందరికీ తెలుసు. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. క్రమంగా బ్లాక్ బాస్టర్ హిట్స్‌ను కొడుతూ టాలీవుడ్ లోనూ తనకంటూ.. ఓ స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన ప్రతి సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసి.. వందకోట్లను కోల్లాకొడుతున్నాడు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్.. క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్దమయ్యాడు.
ఇప్పుడు ..దళపతి డైరెక్ట్‌గా తెలుగులోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. టాలీవుడ్ సక్సెస్ డైరెకర్ట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేయబోతున్నాడు. విజయ్ వంశీ కాంబోలో ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మేరకు వంశీ పైడిపల్లి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫిషియల్ అనౌన్స్ చేశారు.
అయితే ఈ సినిమా ఏ కథాంశం తెరకెక్కుతోంది? ఇందులో హీరోయిన్ ఎవరు? సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే విషయాల గురించి త్వరలోనే తెలియజేయునునట్లు చిత్రబృందం వెల్లడించారు. విజయ్.. మొదటిసారి పూర్తిస్థాయిలో తెలుగులో నటిస్తున్న ఈ సినిమా కావడంతో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచిచూడాల్సి ఉంది. మరోవైపు .. ఈ సినిమా కోసం విజయ్ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.