డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి ఊరట కలిగించేలా నాంపల్లి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డ్రంక్ డ్రైవ్ లో పట్టుపడిన వాహనాదారులకు రూ. 2,100 ఫైన్ కట్టించుకొని వదిలేయాలని నిర్ణయం తీసుకుంది. 2018 నుండి ఇప్పటి వరకు 28 వేల 938 పెండింగ్ చాలన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 19 నుండి మార్చి 12 వరకు ఫైన్ కట్టుకునే అవకాశం కలిపించింది కోర్టు. దీంతో నాంపల్లి లోకదాలత్ వద్ద క్యూ కడుతున్నారు డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడ్డారు వాహనాదారులు.
ఇందులో భాగంగానే 3 రోజుల్లో సుమారు 3 వేల మంది కోర్టులో హాజరు అయ్యారు.. లేబర్ వర్క్స్, ఆటో డ్రైవర్స్ పనులు చేసుకునే వారికి మరింత ఊరట కలిగించే తీర్పు ఇచ్చింది కోర్టు. గతంలో డ్రంక్ డ్రైవ్ లో పట్టుపడితే 10,500 ఫైన్ తో పాటు జైలు శిక్ష విధించిన కోర్ట్…ఇప్పుడు కేవలం రూ. 2,100 ఫైన్ కట్టించుకొని వదిలేస్తూ నిర్ణయం తీసుకుంది.
డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి ఊరట కలుగనుంది. ఇక తాజాగా నాంపల్లి కోర్టు ఫైన్ తగ్గించడంపై తీసుకున్న నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉంటామని చెబుతున్నారు.