తెలంగాణను మళ్ళీ ఏపీలో కలపడం సాధ్యం కాదు : వైఎస్‌ షర్మిల

-

బంగారు తెలంగాణ కాదు.. బొందల తెలంగాణగా మార్చాడని కేసీఆర్ పై ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. ఈ దరిద్రం ఇక్కడితో చాలు అన్నట్లూ… దేశం మొత్తం వద్దు అంటూ ఎద్దేవా చేశారు. ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోయే దాన్ని కాదు, లొంగిపోయే దాన్ని కాదని.. తెలంగాణను మళ్ళీ ఏపీలో కలపడం సాధ్యం కాదని వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sharmila
Sharmila

బీజేపీ, ఎంఐఎం మతత్వం గురించి మాట్లాడుతుంటే, కేసీఆర్, కేటీఆర్ లు తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణా ఎక్కడ ఉందని.. మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు.

బడులు ఎక్కువ ఉన్నాయా? బార్లు ఎక్కువగా ఉన్నాయా? అంటూ ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణ కాదు, తాగుబోతుల తెలంగాణగా మార్చారని.. ఆత్మహత్యల తెలంగాణ, అప్పుల తెలంగాణ మార్చారని ఆగ్రహించారు. దళితులకు గౌరవం ఎక్కడుంది? అని ప్రశ్నించారు. మొన్నటి వరకు మహిళా కమిషన్ లేదు? మహిళా మంత్రి లేరు? అని ఆగ్రహించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి కాలం చెల్లిందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news