బాలయ్య వివాదస్పద వ్యాఖ్యలు..అక్కినేని..తొక్కినేని అంటూ !

-

ఏ విషయాన్ని అయినా నిజాయితీగా, ధైర్యంగా చెప్పడం అనేది ఒక గర్జనలా ఉండాలని నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. అలా ఉండాలంటే తనలా సింహంలా పుట్టాలని, ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో సరదాగా చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత తాను చేసిన ఫ్యాక్షన్ సినిమా ఇది అని అన్నారు.

రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈ కథను ఇతర ప్రాంతాలకి చెందిన ప్రజలు, వివిధ భాషల వారు కూడా ఆదరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా, ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ‘అక్కినేని తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియో పై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలిపే సందర్భంలో ఈ వాక్యాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news