కరోనాపై పోరుకు బాలకృష్ణ భారీ విరాళం..

-

కరోనాపై పోరుకు సాయంగా హీరో నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. మొత్తంగా 1.25 కోట్ల విరాళం అంజేయనున్నట్టు తెలిపారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 50 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నారు. మరో రూ. 25 లక్షలను చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ చారిటీకి(సీసీసీ) అందజేశారు. ఈ మేరకు సీసీసీ మెంబర్‌గా ఉన్న సి.కల్యాణ్‌కు రూ. 25 లక్షల చెక్‌ అందజేశారు.

కాగా, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా షూటింగ్‌లు నిలిచిపోయి సినీ కార్మికలు పరిస్థితి దయనీయంగా మారడంతో.. వారిని ఆదుకునేందకు చిరంజీవి చైర్మన్‌గా ‘సీసీసీ మనకోసం’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, సురేష్ బాబు, సి.కల్యాణ్, దాము, బెన‌ర్జీ, దర్శకుడు శంకర్‌ సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చారిటీకి పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు.

సోదరుడు బాలకృష్ణకు కృతజ్ఞతలు : చిరంజీవి


కరోనాపై పోరుకు బాలకృష్ణ విరాళం ప్రకటించడంపై చిరంజీవి స్పందించారు. సీసీసీకి రూ. 25 లక్షలు, తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం ప్రకటించిన సోదరుడు బాలకృష్ణకు కృతజ్ఞతలు అని ట్వీట్‌ చేశారు. ‘ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒకటిగా ముందుకొస్తే, మీరు ఎప్పుడూ తోడుంటారు’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news