బాలకృష్ణ తొలి కమర్షియల్‌ యాడ్‌.. అదిరిందిగా..!

-

సాధారణంగా కాస్త ఫేం, సెలబ్రిటీ హోదా రాగానే వారి వద్దకు పలు సంస్థలు యాడ్స్ కోసం క్యూ కడుతుంటాయి. వారి ఫేంని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటాయి. అలా యూట్యూబర్ ల నుంచి సూపర్ స్టార్స్ వరకు చాలా మంది చాలా రకాల యాడ్స్ లో నటిస్తుంటాయి. నటించినందుకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం యాడ్స్ కి దూరంగా ఉంటారు. అలాంటి వారిలో ముందుంటారు నందమూరి బాలకృష్ణ.

ఓవైపు వెండితెరపై..మరోవైపు బుల్లితెరపై ప్రేక్షకులను నాన్ స్టాప్ గా అలరిస్తూ అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తున్నాడు బాలయ్య. తాజాగా ఆయన అడ్వర్టైజింగ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక అప్‌డేట్‌ వచ్చింది. బాలకృష్ణ తొలి కమర్షియల్‌ యాడ్‌ వీడియో వచ్చేసింది. లీడింగ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సాయిప్రియ గ్రూపునకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు బాలకృష్ణ. ఈ టాలెంటెడ్‌ హీరో సినిమాటిక్‌ స్టైల్‌లో 116 పారామౌంట్‌ వెంచర్‌ ను ప్రమోట్‌ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news