పోలీసులు కాళ్లపై పడేలా చేస్తా.. లేకుంటే పేరు మార్చుకుంటా : సువేందు 

-

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌, బీజేపీలు ఎప్పుడు ఉప్పునిప్పులా ఉంటాయి. తాజాగా ఈ రెండు పార్టీల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలీసు కస్టడీలో ఉన్న తమ పార్టీ నాయకుడు సత్యబ్రత దాస్‌ను సుతహత ఠాణా పోలీసు అధికారులు ఇద్దరు చెంప చెళ్లుమనిపించారని శాసనసభలో బీజేపీపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు.

‘‘దాస్‌ను కొట్టిన పోలీసులు అతని కాళ్లపై పడాల్సిందే. అలా చేయలేకపోతే నేను సువేందు అధికారినే కాదు. నా పేరు మార్చుకుంటా’’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర మంత్రి ఫిర్హద్‌ హకీం గట్టిగా బదులిచ్చారు. ‘‘సువేందు త్వరలోనే పేరు మార్చుకోబోతున్నారు. ఆ కొత్తపేరు ఏంటన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఆయన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడినట్టు కచ్చితమైన ఆధారాలు ఉండటం వల్లే పోలీసులు దాస్‌ను అరెస్టు చేశారు’’ అని మంత్రి చెప్పారు.

సువేందు అనుచరుడైన సత్యబ్రత దాస్‌… మున్సిపాలిటీ టెండర్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఈనెల 19న ఆయన్ను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news