ఈ క్రిస్మస్ శ్యామ్ సింగరాయ్ దే : నాని

విభిన్న చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచే హీరో నాని. వరుస సినిమాలు చేస్తూ నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను నిన్న చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు పాత్రలలో నాని డ్యుయల్ రోల్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్ లు గా నటించారు.

ఇదిలా ఉండగా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నాని మాట్లాడుతూ…..ఒక మంచి సినిమా చేశాక మనసులో నిండు గర్వం కనిపిస్తుందని అన్నారు. శ్యామ్ సింగారాయ్ చేశాక తనకు అలాంటి అనుభూతులే కలిగాయని…ఖచ్చితంగా చెబుతున్నా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సంతృప్తి గా బయటకు వెళతారని అన్నారు. సిరివెన్నెల ఈ సినిమాలో దేవి పై అద్భుత మైన పాట రాశారని అన్నారు. కీర్తి పాత్రలో కృతి శెట్టి అద్భుతంగా నటించింది అని నాని చెప్పారు.