నాని ” అంటే.. సుందరానికీ” మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్

-

నాని హీరోగా నటించిన “అంటే..సుందరానికీ” సినిమాను వచ్చే నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా ప్రమోషన్స్ జోరును పెంచారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి నజ్రియా పాత్ర లీలా థామస్ కి సంబంధించిన బ్లూపర్స్ ను వదిలిన టీం, తాజాగా ట్రైలర్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది.ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ, కామెడీ టచ్ తో కూడిన సీన్ పై ఈ గ్లింప్స్ ని కట్ చేశారు.

ట్రైలర్ ను వచ్చే నెల 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నరేష్, నదియా, రోహిణి కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news