బయటెక్కడో ఉన్నాడు..ఉండకూడదు : నాని

సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో చిన్నారిపై జ‌రిగిన అత్యాచారాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఖండిస్తున్నారు. నింధితుడు రాజ‌కు క‌ఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక సెల‌బ్రెటీలు సైతం ఈ ఘ‌ట‌నపై త‌న‌దైన రీతిలో స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే మంచు మ‌నోజ్ బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి వారికి వెంట‌నే న్యాయం చేయాల‌ని డిమాండ్ చేయ‌గా తాజాగా హీరో నాని కూడా ఘాటుగా స్పందించారు.

సైదాబాద్ నింధితుడు ఘ‌ట‌న జ‌రిగిన నాటి నుండి ప‌రారిలో ఉన్న నేప‌థ్యంలో పోలీసులు బృంధాలు గా ఏర్ప‌డి నింధితుడి కోసం గాలిస్తున్నారు. అయితే నింధితుడి ఆచూకి ల‌భించ‌కపోవ‌డంతో పోలీసులు నింధితున్ని ప‌ట్టించిన వారికి ప‌దిల‌క్ష‌ల రివార్డు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కాగా సోష‌ల్ మీడియాలో పోలీసులు పోస్ట్ చేసిన ఫోటోను షేర్ చేసిన హీరో నాని బ‌య‌టెక్క‌డో ఉన్నాడు..ఉండ కూడదు అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక నాని ట్వీట్ కు నింధితుడిని ఉరి తీయాలంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.