బ్రేకింగ్ : ఈడీ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్

టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో భాగంగా ఈడీ విచారణకు… ఐటెం సాంగ్ స్టార్ నటి ముమైత్ ఖాన్ హాజరైంది. తన గెస్ట్ హౌస్ నుంచి నేరుగా కాసేపటి క్రితమే ఈడీ విచారణకు హాజరైంది ముమైత్ ఖాన్. ఈడీ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్ ను… టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. అంతేకాదు డ్రగ్స్ కేసు లో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు.

ఇక ముమైత్ ఖాన్ ను ఇవాళ సాయంత్రం వరకు ఈడీ అధికారులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.  కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసు లో  సినీ తారలు   ఒక్కొక్కరుగా ఈడీ ముందుకు హాజరవుతూ వస్తున్నారు. నోటీసులు అందిన వారిలో పూరీ జగన్నాథ్, ఛార్మి, రానా, రకుల్, రవి తేజ,  నవదీప్ ఈడీ ఎదుట హాజరయ్యారు.