ఆ బాలీవుడ్ బ్యూటీతో నటించడానికి అవకాశం వస్తే ఎప్పుడైనా సిద్ధమేనంటున్న నాని..

-

టాలీవుడ్ స్టార్ హీరో నాని ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్లో బిజీగా గడుపుతున్నాడు ఈ హీరో. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో తనకి ఇష్టమైన హీరోయిన్ గురించి తెలిపారు.

నేచురల్ స్టార్ నాని తాజాగా దసరా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో నార్త్ ఇండియా పై ఫోకస్ పెంచారు నాని. ఇందులో భాగంగా బీటౌన్ లో తిరుగుతూ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్న ఈ హీరో బాలీవుడ్ లో తనకి ఇష్టమైన నటీనటుల గురించి తెలిపారు. తనకు ఛాన్స్ వస్తే దీపికా పదుకొనేతో కలిసి నటించాలని కోరికగా ఉందని తెలిపారు.

 

 

దీపికా పదుకొనే తో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చిన నాని.. ఆమె ఒక అద్భుతమైన నటి అని అవకాశం వచ్చి మంచి కథ దొరికితే ఆమెతో నటించడానికి ఎప్పుడైనా సిద్ధమేనని అన్నారు. అలాగే అమీర్ ఖాన్ అంటే కూడా తనకి ఎంతో ఇష్టమని బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీతో కలిసి పని చేయాలని తన కోరికని తెలిపారు. ఆయన సినిమాలు ఎప్పుడో చూస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

గోదావరి ఖని లోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న విడుదలకు సిద్ధం కానుంది. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ నటించగా దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version