కరోనా ఎలా పోతుందో చెప్పిన నాని కొడుకు.. క్యూట్‌ వీడియో

-

కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్స్‌ రద్దు కావడంతో సినీ నటులు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు.. షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్‌ చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ చారిటీకి విరాళాలు కూడా అందజేశారు. మరోవైపు సోషల్‌ మీడియా ద్వారా కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా.. అభిమానులకు వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు.

సోషల్‌ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, తమ హోం క్వారంటైన్‌కు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకోవడం చేస్తున్నారు. తాజాగా నాని తన కొడుకు అర్జున్‌(జున్ను)కు సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అందులో కిటికీ వద్ద నిలుచున్న జున్ను.. కరోనా గురించి నాని ప్రశ్నలు అడుగుతుంటే జున్ను వాటికి చాలా క్యూట్‌గా సమాధానమిచ్చాడు. ఇదివరకు కూడా కరోనాపై అవగాహన కలిగించేలా సోషల్‌ మీడియాలో పలు పోస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే.

వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ..
నాని: బయట ఎవరు ఉన్నారు?
జున్ను: కరోనా వైరస్.
నాని: ఇప్పుడు మనం ఏం చేయాలి?
జున్ను: ఇంట్లోనే ఉండాలి.
నాని: అప్పుడు ఏం జరుగుతుంది?
జున్ను: గో.. కరోనా వైరస్ గో..
నాని: గుడ్.. వెరీ గుడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version