టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల ముందు చెత్త వేయడం కాదు.. బీసీ నాయకులు విగ్రహాలు తీసేస్తామన్న మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలని ఆయన అన్నారు. నిన్న ఉయ్యూరులో తమకు లోన్ లు ఇవ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు చెత్త వేశారు. దానిని ఉదాహరిస్తూ నివాస యోగ్యం కానీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నందుకు జగన్ రెడ్డి, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలని అన్నారు.
గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని మంత్రి అప్పల రాజు దుర్మార్గ వ్యాఖ్యలు చేశారు. లచ్చన్న విగ్రహం పెట్టిన స్థలం తనదేనని యజమాని పాపారావు చెప్పారని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తోందన్న ఆయన దళితులు, మహిళలపై గణనీయంగా దాడులు పెరిగాయని అన్నారు. ప్రజా స్వామ్యాన్ని పౌర హక్కులను నుజ్జు నుజ్జు చేశారని రాగ ద్వేషాలు లేకుండా పరిపాలిస్తామని రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని అటకెక్కించారని అన్నారు. అధికార మదంతో కళ్లు నెత్తికెక్క మాట్లాడుతున్నారన్న ఆయన నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారు? అని ప్రశ్నించారు.