బ్లాక్ బస్టర్ బ్యానర్లో నాని కొత్త చిత్రం..

నిర్మించింది కొన్ని సినిమాలే కావచ్చు. కానీ అవన్నీ బ్లాక్ బస్టర్లే. ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని రోజులే కావచ్చు. కానీ ప్రతీ స్టార్ హీరోలందరితో సినిమాలు తీసేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగ చైతన్య, ఇప్పుడు నాని.. మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును.. ఈ చర్చంతా మైత్రీ మూవీ మేకర్స్ గురించే. తాజాగా ఈ ప్రతిష్టాత్మక బ్యానర్ నుండి మరో కొత్త సినిమా వచ్చేస్తుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా ఈ చిత్రం రూపొందుతుందని సమాచారం.

ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం టక్ జగదీష్ తో పాటు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అవే కాకుండా మరో వైవిధ్యమైన దర్శకుడితో కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడట. అందుకు రేపే ముహూర్తం అని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. ఆ దర్శకుడు మరెవరో కాదు, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి విభిన్న చిత్రాలు తెరకెక్కించి సక్సెస్ అందుకున్న వివేక్ ఆత్రేయతో అని అంటున్నారు. మరి రేపు మైత్రీ మూవీ మేకర్స్ ఏం చెబుతుందో చూడాలి.