కోర్టుకెక్కిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్

ఎన్నికలు మరికొద్ది రోజులు ఉందనంగా సిద్ధిపేటలో పోలీసులు రైడ్స్ చేయడం కలకలం రేపింది. దుబ్బాక ఎన్నికల్లో నోట్ల కట్టల కలకలం రేగింది. బీజేపీ అభ్యర్ధి రఘు నందన్ రావుకు చెందిన ఇళ్ళలో పోలీసులు తనిఖీలు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. రఘునందన్ రావు ఇంట్లో తనిఖీలు చేపట్టగా అక్కడ 18 లక్షల 64 వేలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ తనిఖీల సమయంలో బీజేపీ నేతలు గలాటా సృష్టించారు.

Raghunandan
Raghunandan

అప్పుడు ఈ ఘటన మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. ఇప్పుడు ఈ ఘటనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్ధిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రూ.18 లక్షలు లభించాయని కట్టు కథ అల్లారని పిటిషన్ లో పేర్కొన్నారు రఘునందన్ రావు. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్ద రఘునందన్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందన్న న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు.