ప్రతిపక్ష పార్టీలు చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై టిడిపి నేత నారా లోకేష్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశాడు. అంతేకాకుండా రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తీసుకొని వద్దామని తెలిపారు. ఇక రాష్ట్రంలో దిశా వంటి సంఘటనలు చోటు చేసుకున్నా కూడా.. ఇప్పటి వరకు మహిళా కమిషన్ ఏర్పాటు చేసుకోవటం చాలా దురదృష్టకరం అని ఆయన తెలిపారు.
ఇక మహిళా హక్కులను కాపాడుకునేందుకు ముందు అడుగు వేదం అంటూ తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పై మహిళా కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఒత్తిడి తెచ్చేందుకు #TSNeedsWomenCommission సోషల్ మీడియా వేదికగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేద్దాం అని నారా లోకేష్ తెలిపాడు.
దిశ వంటి ఘటనలు జరిగాకా కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళాకమిషన్ ఏర్పడకపోవడం దురదృష్టకరం.మహిళల హక్కులను కాపాడేందుకు నడుం కడదాం.మహిళా కమిషన్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు #TSNeedsWomenCommission అంటూ ట్విట్టర్ వేదికగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో డిమాండ్ చేద్దాం pic.twitter.com/elIoDidkn8
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 8, 2020