స్కిల్ డెవలప్మెంట్ లో తప్పు జరగలేదని నిరూపిస్తా : నారా లోకేష్

చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో నారా లోకేష్ తండ్రిని ఎలాగైనా బయటకు తీసుకురావడానికి అవసరం అయిన అన్ని మార్గాలను వెతుకుతున్నాడు. అందులో భాగంగా లోకేష్ ఢిల్లీ వెళ్లి అక్కడ న్యాయపరంగా ఎటువంటి జాగ్రత్తలు మరియు స్టెప్స్ తీసుకోవాలి అన్న విషయంపై పలువురిని కలిసినట్లు తెలుస్తోంది. లోకేష్ ఢిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేవలం ప్రజలకు మంచి చేయడానికి జరిగిందని, ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లు అవినీతి జరగలేదని అందరూ చెప్పుకునే సమయం ముందు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నారా లోకేష్. మా తండ్రికి జరిగిన అన్యాయాన్ని తెలియచేయడానికి ఢిల్లీకి వచ్చానని లోకేష్ క్లియర్ గా చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లో అవినీతి జరగలేదని మా అందరికీ తెలుసు, త్వరలోనే అన్ని ప్రూఫ్స్ తో సహా నిరూపించి మా నాన్నను అవినీతి కేసు నుండి క్లీన్ చిట్ తీసుకువస్తానని ఛాలెంజ్ చేశారు నారా లోకేష్.

మరి లోకేష్ అనుకున్నది చేసి చూపిస్తారా ? లోకేష్ మాటలు చేతల్లో చూపిస్తాడా ఏమిటన్నది తెలియాల్సి ఉంది.