సైకో పాలకులారా… నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతమవుతుంది : లోకేశ్‌

-

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో కేసులో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు చోట్ల ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే పలు కళాశాలల విద్యార్థులు సైతం నిరసన తెలిపేందుకు ముందుకు వచ్చారు. అయితే.. విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇంటికి పంపించేయడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో ఎమర్జెన్సీ ఏమైనా ప్రకటించారా? అని ప్రశ్నించారు.

Is Caste Behind Kokapet 100 Crore Per Acre Deal? - Nara Lokesh

“చంద్రబాబు అక్రమ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలపాలని విజయవాడలోని వివిధ కళాశాలల విద్యార్థులు భావించారు నారా లోకేశ్. ఆ విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించడం దారుణం. సిద్ధార్థ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పెద్ద ఎత్తున పోలీసులు చొరబడడం ఎమర్జెన్సీని నారా లోకేశ్ తలపిస్తోంది. తరగతులు సస్పెండ్ చేయించి, కళాశాలలకు పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక సైకో జగన్ ప్రభుత్వ ఆదేశాలే కారణం. సైకో పాలకులారా… నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతమవుతుందని గుర్తుంచుకోండి” అని లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు నారా లోకేశ్. అంతేకాదు, సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి విద్యార్థులకు సెలవు ప్రకటించి, వెంటనే ఇంటికి వెళ్లాలని, ఎలాంటి రాస్తారోకోలు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, అల్లర్లలో పాల్గొనరాదంటూ జారీ చేసిన సర్క్యులర్ ను కూడా పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news