ఎస్సై ఉద్యోగాల కోసం నిర్వహించిన ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ)లో అపశ్రుతి చోటుచేసుకుంది. రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న యువకుడు సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలో వెళ్లిన అతడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఎస్సై సెలక్షన్స్‌లో చోటుచేసుకుంది. అంకిరెడ్డిపాలెంకు చెందిన మోహన్ కుమార్ అనే యువకుడు.. ఎస్సై సెలక్షన్స్‌లో భాగంగా నిర్వహించిన 1600 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొన్నాడు.
1600 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొన్న మోహన్ కుమారు.. సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు.. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. హుటాహుటినా.. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది.. ఎందుకంటే అప్పటికే మోహన్‌కుమార్ మృతిచెందినట్టు గుంటూరు జీజీహెచ్ వైద్యులు తెలిపారు. మోహన్‌కుమార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. అప్పటికే మృతిచెందినట్టు తేల్చారు డాక్టర్లు.. దీంతో.. మోహన్ కుమార్ స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. ఈ ఘటనతో అంకిరెడ్డిపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆస్పత్రి బెడ్‌పై అచేతనంగా పడి ఉన్న మోహన్ కుమార్‌ను లేవమంటూ అతడి స్నేహితులు రోదిస్తుండటం అక్కడున్న వారిని కంటితడిపెట్టిస్తోంది. అప్పటి వరకూ తమతోనే ఉన్న స్నేహితుడు మృతిచెందాడంటే నమ్మలేకపోతున్నారు.