ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి టీడీపీ నేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో ఫేక్ లేఖలతో ఫేక్ సీఎం జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని మండిపడ్డారు. ఫేక్ సీఎం జగన్ గారూ! విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ మీరు చేసిన అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖలు ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో తేలిపోయిందని ఫైర్ అయ్యారు లోకేష్.
ఇప్పటికైనా జగన్నాటకాలు ఆపి, ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణని ఆపే ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రహీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు లోకేష్.
వైసీపీ ఎంపీల్ని మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్రయోజనాల పరిరక్షణకు పోరాడాలని ఆదేశాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.