తెలంగాణలో హాట్ టాపిక్: త్రికోణంలో చతుర్ముఖం…?

-

తెలంగాణ రాజకీయాల్లో మొన్నటివరకు అధికార టీఆర్ఎస్‌కు తిరుగులేదు. అసలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ ముందు నిలబడలేకపోయాయి. ఏ ఎన్నికల్లోనైనా గులాబీ పార్టీదే పైచేయి. దీంతో తెలంగాణలో ప్రతిపక్షాల పని అయిపోయిందని విశ్లేషణలు వచ్చాయి. కాంగ్రెస్ రోజురోజుకూ వీక్ అవ్వడంతో టీఆర్ఎస్‌కు ఎదురేలేదని అంతా అనుకున్నారు.

తెలంగాణ
తెలంగాణ

కానీ ఊహించని విధంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ తెలంగాణలో రేసులోకి వచ్చింది. ఇతర పార్టీ నాయకులని వరుసగా చేర్చుకుంటూ దూకుడు మొదలుపెట్టింది. అలాగే దుబ్బాక ఉపఎన్నికలో అధికార పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. ఇంకా జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు దాదాపు చెక్ పెట్టినంత పనిచేసింది. దీంతో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని విశ్లేషణలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పోటీ జరుగుతుందని అన్నారు.

కానీ ఊహించని విధంగా తెలంగాణ పీసీసీ బాధ్యతలు రేవంత్ రెడ్డికి దక్కడంతో పరిస్తితి మారింది. ఆ పార్టీలోని విభేదాలు పక్కనబెట్టి టీఆర్ఎస్‌పై యుద్ధం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. రేవంత్ సైతం దూకుడుగా టీఆర్ఎస్, బీజేపీలని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోరు నడుస్తుందని చెబుతున్నారు. కానీ ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగడం ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ బలంగా ఉన్నా సరే కాంగ్రెస్‌కు రాష్ర్ట స్థాయిలో బలమైన కేడర్ ఉందని, రేవంత్ రాకతో కేడర్ యాక్టివ్ అయిందని, ఇప్పుడు టీఆర్ఎస్‌కు పోటీగా వస్తారని చెబుతున్నారు. ఇటు బీజేపీకి బలమైన నాయకత్వం ఉందని, ఆ పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అంటున్నారు.

అయితే ఇప్పుడు వైఎస్సార్ తనయురాలు షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో తాము రేసులో ఉన్నామని షర్మిల పార్టీకి చెందినవారు చెబుతున్నారు. దీంతో చతుర్ముఖ పోరు తెరపైకి వచ్చింది. కానీ వాస్తవ పరిస్తితులని చూస్తే తెలంగాణలో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్యే ప్రధాన పోరు జరగనుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news