డ్రగ్స్ రహిత ఏపీ కోసం యుద్ధం చేద్దాము: నారా లోకేష్

-

పాఠశాల విద్యార్థుల పాలిట శాపాలుగా వైకాపా సర్కారు పాపాలు శాపాలు గామారాయని నారా లోకేష్ ఆరోపించారు. పాఠశాలలో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలతో విద్యార్థి దశలోనే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోంది అని నారా లోకేష్ చెప్పారు ప్రజలారా కలిసి రండి మహమ్మారిపై యుద్ధం చేద్దామని అన్నారు. ఈ మేరకు నారా లోకేష్ ఒక వీడియోని కూడా చేశారు. వైకాపా పాలనలో బడి గుడిలోకి గంజాయి వచ్చేసింది అని అన్నారు.

విద్యార్థులు మద్యం మత్తులో బడికి వస్తున్నారు. సీఎం జగన్ ఇంటి ఎదురుకుండా గంజాయికి బానిసైనా పిల్లాడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెని పోలీసులు బెదిరించి నోరు మూయించారు. సీఎం ఇంటి కి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడిని ఇంకా పట్టుకోలేదని అక్కడ మద్యం మత్తులో ఉన్మాది అంధురాలని హత్య చేస్తే చర్యలు లేవు అని నారా లోకేష్ అన్నారు. చంద్రగిరిలో 9వ తరగతి అమ్మాయి గంజాయికి బానిస అయింది, చోడవరం ఏడవ తరగతి విద్యార్థులు స్కూల్లో మద్యం తాగారు. వీడియో తీసిన వారిపై దాడికి పాల్పడ్డారు అంటూ నారా రోహిత్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version