ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడాలి. బలపడితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎంత చరిత్ర ఉన్న పార్టీ అయినా సరే ఒకసారి కుదుపు వస్తే కష్టపడాలి. అలా అయితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. నాయకత్వ మార్పులు చెయ్యాలి. నాయకత్వంలో అసమర్ధులను పక్కకు తప్పించాలి. కొత్త వారికి అవకాశాలు ఇస్తూనే సరికొత్త మార్గాలను ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్ళే ఆలోచన చెయ్యాలి.
కాని ఇక్కడ అది జరగడం లేదు. పార్టీలో ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళ కోసమే కొన్ని పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ కొందరికి బాధ్యతలు అప్పగించారు. వాళ్ళు అందరూ కూడా కొందరితో అనవసర స్నేహం చేస్తున్నారట.
అనవసర స్నేహం అంటే వైసీపీ కార్యకర్తలతో వీళ్ళు స్నేహం చేయడం, సోషల్ మీడియాలో పార్టీ కోసం చేసే కార్యక్రమాలను వారికి చెప్పడం ఇలాంటివి చేస్తున్నారు. ఇక ఎవరైనా ముఖ్యమంత్రి జగన్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే… వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడం. ఇలా ఉత్సాహంగా ఉండే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారట వైసీపీ కార్యకర్తలు. చినబాబు బాధ్యతలు ఇచ్చిన వారే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.
దీనితో పార్టీలో కొందరు ఉత్సాహంగా పని చేసే కార్యకర్తలు ఆవేదన వ్యక్త౦ చేస్తున్నారు. లోకేష్ ఎవరికి అయితే కీలక బాధ్యతలు అప్పగించారో వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు. చాలా మంది కోవర్ట్ ల దెబ్బకు తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. మరి ఈ పరిస్థితి నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా ఎప్పుడు బయటకు వస్తుంది అనేది చూడాలి.