రఘురామ నేడు విడుదల అవుతారా…?

-

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు నేడు బెయిల్ విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించింది. నేడు ట్రయిల్ కోర్ట్ లో లక్ష వ్యక్తిగత బాండ్ , ఇద్దరు పూచీకత్తులు రఘురామా తరుపు న్యాయవాదులు సమర్పిస్తారు. బెయిల్ పై బయటి వచ్చాక సీఐడీ పోలీసుల విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసులో విచారణ చేయాలనుకుంటే 24 గంటలు ముందు నోటీసులు జారీ చేయాలని CID పోలీసులకు సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ పై వచ్చిన రఘురామ మీడియా తో మాట్లాడడం కానీ , ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చేయకుదంటూ షరతు విధించారు. సుప్రీం కోర్ట్ ఆదేశించిన షరతులు ఉల్లంగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని న్యాయస్థానం పేర్కోంది. ఇప్పటికే మిలటరీ ఆస్పత్రికి సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందింది. సీఐడీ కోర్టు లో బెయిల్ ప్రక్రియ పూర్తి చేసి , రిలీజ్ ఆర్డర్ చూపించిన తరువాత రఘురామ ను మిలిటరీ ఆస్పత్రి నుండి విడుదల చేసే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version