మీరు బ్యాంక్ నుండి ఏదైనా లోన్ తీసుకున్నారా..? మరి సరైన సమయానికి డబ్బులు కట్టేస్తే మంచిది. లేక పోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరైన సమయానికి కనుక ఈఎంఐ కట్ట లేదు అంటే రుణ గ్రహీతలకు చిక్కులు ఎక్కువవుతాయి. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే..
ఎప్పుడైనా లోన్ తీసుకుంటే సరిగ్గా సమయానికి డబ్బులు చెల్లించాలి. ఈఎంఐ కట్టక్కపోతే భారీ చార్జీలు చెల్లించుకోవలసి ఉంటుంది. రూ.750 వరకు చార్జీలు పడతాయి. కనుక సమయానికి మీరు డబ్బులు కట్టేస్తే మంచిది. బ్యాంక్ అకౌంట్‌లో లోన్ ఈఎంఐకి సరిపడా డబ్బులు ఉండేలా చూసుకుంటూ ఉండాలి. లేదు అంటే రూ.750 అదనంగా బ్యాంకుకు చెల్లించాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో లోన్ తీసుకుని సమయానికి డబ్బులు చెల్లించక పోతే .500కు చార్జీలు వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే రూ.350 నుంచి రూ.750 వరకు చార్జీలు తీసుకుంటున్నాయి.
కాబట్టి చార్జీలు పడకుండా చూసుకోవడం మంచిది. ప్రైవేట్ బ్యాంకుల్లో చార్జీలు ఎక్కువ తీసుకుంటున్నాయి. అదే విధంగా మీరు కనుక లోన్ తీసుకుని సమయానికి డబ్బులు చెల్లించక పోతే ఈఎంఐ మిస్ చేస్తే కనుక క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని గుర్తు పెట్టుకోవాలి.