ఆత్మరక్షణ కోసమే భారత్ ఆయుధాలు వాడుతుంది : మోడీ

-

ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయదశమి రోజున భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ చేస్తారని వెల్లడించారు. విశ్వమానవ సంక్షేమం కాంక్షిస్తూ దసరా వేళ శక్తిపూజ చేస్తామని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా పండుగ ప్రతీక అని వివరించారు. ఇక, అయోధ్యలో సుదీర్ఘకాలం తర్వాత రామమందిరం నిర్మాణం జరుపుకుంటుండడాన్ని చూడడం మన అదృష్టమని పేర్కొన్నారు. రామ మందిరం నిర్మాణం మన సహనానికి దక్కిన విజయం అని అభివర్ణించారు. ఆత్మరక్షణ కోసమే భారత్ ఆయుధాలు వాడుతుందని మోదీ స్పష్టం చేశారు. ఇతర దేశాలపై ఆధిపత్యం భారత్ విధానం కాదని ఉద్ఘాటించారు.

‘అనేక శుభపరిణామాల మధ్య దసరా వేడుకల్ని జరుపుకొంటున్నామన్న ప్రధాని.. చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం కావడం, కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం, మహిళా రిజర్వేషన్‌బిల్లు ఆమోదించడం వంటి అంశాలను ప్రస్తావించారు. ‘విజయ దశమి రోజున అందరూ భక్తిశ్రద్ధలతో ఆయుధపూజ చేస్తారు. ఆత్మ రక్షణ కోసమే భారత్‌ ఆయుధాలు వాడుతోంది. ఇతర దేశాలపై ఆధిపత్యం మా విధానం కాదు. విశ్వమానవ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ దసరా రోజు శక్తి పూజ చేస్తాం’’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news