నారీమణి: సినిమాలలో సత్తా చూపిస్తున్న లేడీ డైరెక్టర్స్..!

-

సాధారణంగా సినిమా డైరెక్టర్ అనగానే మేల్ పోస్టర్ ఎక్కువగా అందరి మదిలో మెదులుతూ ఉంటుంది. ఇక టాలీవుడ్ , బాలీవుడ్ ఏదైనా సరే కచ్చితంగా కెప్టెన్ ఆఫ్ హౌస్ మాత్రం మగవాడే అన్న అభిప్రాయం అందరిలో బలంగా పడిపోయింది ఇక తొలినుంచి పూర్తిస్థాయిలో డైరెక్టర్లే ఎక్కువగా ఈ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కూడా మహిళా దర్శకులు కూడా స్టార్ట్ కెమెరా , యాక్షన్ అంటున్నారు కాకపోతే ఈ సౌండ్ మాత్రం మనకు అప్పుడప్పుడు మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ఇక టాలీవుడ్ లో మహిళా దర్శకులు పెరగబోతున్నారా అంటే అవుననే చెప్పాలి . నిజానికి సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల ఉనికి తక్కువే అయినా ఇప్పుడు రోజురోజుకు పెరుగుతోందని చెప్పాలి.

ముఖ్యంగా సినిమా అనేది రంగుల ప్రపంచం.. మరో లోకం.. 24 ఫ్రేమ్స్ క్రియేటివిటీ కలకలలాడే చోటు అది.. అలాంటి సినిమాను లీడ్ చేసేది డైరెక్టర్ మాత్రమే. రచయిత కథను రూపొందిస్తే ప్రేక్షకుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ఆ కథ సినిమాగా డైరెక్టర్ మారుస్తారు.. ఇంత కీలకమైన దర్శకత్వ శాఖలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడం తొలి నుంచి చాలా తక్కువే అని చెప్పాలి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి.. కొత్త కొత్త ఆలోచనలతో సరికొత్త సినిమాలకు యాక్షన్ చెబుతున్నారు.

ఇక ప్రేక్షకులను మెప్పించిన లేడీ దర్శకుల విషయానికి వస్తే.. సూర్య చేత ఆకాశమే నీ హద్దురా సినిమాను రూపొందించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమా అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక వైజాగ్ లో పుట్టి పెరిగిన సుధా కొంగర తమిళ సినీ ఇండస్ట్రీలోని ఎక్కువ కాలం పని చేసింది. మొదట్లో స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన ఈమె బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామా తో తీసిన చిత్రం అటు హిందీ ఇటు తమిళ్ , తెలుగు భాషల్లో విజయం సాధించింది.

ఇక సమంత హిట్స్ లిస్టు పై ఒక లుక్ వేస్తే వెంటనే కనిపించే చిత్రం ఓ బేబీ. ముఖ్యంగా ఈ సినిమాను డైరెక్టర్ చేసింది కూడా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి. లిటిల్ సోల్జర్స్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఈమె కృష్ణవంశీ టీంలో చాలా కాలం కొనసాగింది. ఇకపోతే గతంలో కూడా ఎంతోమంది హిట్ సినిమాలు తెరకేక్కించిన లేడీ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఇక గిన్నిస్ బుక్ లో తెలుగు సినిమాని ఎక్కించింది కూడా తెలుగు దర్శకురాలే కావడం గమనార్హం. లేడీ డైరెక్టర్స్ లో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు విజయనిర్మల..ఈమె 44 సినిమాలకు దర్శకత్వం వహించింది. ఇక మహానటి సావిత్రి కూడా దర్శకురాలిగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news