కరోనా చికిత్సలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్ కీలక పాత్ర పోషిస్తుంది. వెంటిలేటర్ లేకపోతే మాత్రం ఇప్పుడు ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్ తయారి విషయంలో అన్ని దేశాలు దూకుడుగా వెళ్తున్నాయి. చాలా దేశాల్లో వీటి కొరత ఎక్కువగా ఉంది. అన్ని దేశాలు కూడా ఇప్పుడు వీటి కోసం ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.
ఈ తరుణంలో తక్కువ ధరకే వీటిని అందించే విధంగా కృషి చేస్తున్నారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా ఒక వెంటిలేటర్ ని తయారు చేసింది. అత్యాధునిక ఫీచర్లతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్దిష్టంగా కొవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి గానూ నాసా ఒక హై ప్రెజర్ వెంటిలేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు నెల రోజులు కష్టపడి తీసుకొచ్చారు.
‘వెంటిలేటర్ ఇంటర్‌వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబిల్ లోకల్లీ’ (వైటల్) అనే వెంటిలేటర్ ఇటీవల న్యూయార్క్ లో నిర్వహించిన కీలక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అమెరికాలో రోగులు పెరుగుతున్న నేపధ్యంలో వీటిని ఎక్కువగా ఉత్పత్తి చయ్యాలి అని భావిస్తుంది నాసా. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్తున్నా నాసా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది.