ప్రతీ ఆంధ్రుడూ చదవాల్సిన వార్త… ఏపీలో జరుగుతుంది ఇది!!

-

సమయం సందర్భం లేకుండా… ఇది ఎన్నికల సమయం కాదు అని తెలిసినా… వారి ఒరిజినల్ ఇలా అన్ని సందర్భాలలోనూ బయటకు వచ్చేస్తుంటుంది. ఇలాంటి కథనాలు వెలువరించడం వల్ల… జనాలకు వాస్తవాలు చెప్పకపోవడం వల్ల ఎంత ఇబ్బంది అనే సంగతి వారికి పట్టదు. వారికున్న అవగాహనా రాహిత్యం, వాస్తవాలను దాచే బుద్ది.. ప్రజలపై రుద్దుతుంటారు! ఫలితంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంటారు. ఇంతకూ ఈ మాటలన్నీ ఎవరిగురించి అంటారా? ఇంకెవరి గురించి… ఒక వర్గం మీడియా గురించి! వారికి జగన్ పైనా, ఏపీ సర్కార్ పైనా కోపం ఉంటే అది వేరేలా తీర్చుకోవాలి కానీ… ఆ వంకన ఏపీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడాన్ని రాక్షసానందం కాక మరేమంటారు? ఈ సమయంలో ఏపీ వాసులు కరోనా కే భయపడాలా… ఇలాంటి మీడియా ఇస్తున్న కథనాలకు భయపడాలా… లేక దేవుడా వీరి బుద్ది మార్చు అని ఇళ్లల్లో కూర్చుని వేడుకోవాలా?

వివరాళ్లోకి వస్తే… ఏపీ మునిగిపోతుందని, అమెరికా తర్వాత, ఇటలీ స్పెయిన్ ల తర్వాత ఆ స్థాయికి చేరిపోతుందనే రేంజ్ లో కథనాలు వడ్డించేస్తుంది ఏపీలో ఒక వర్గం మీడియా? అసలు ఏపీలో ఏమి జరుగుతుందో వారికి తెలియక కాదు.. ఎందుకు ఇన్నేసి కేసులు నమోదవుతున్నాయో వారికి కనబడక కాదు! అన్నీ తెలిసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ.. జగన్ సర్కార్ పై బురదజల్లి రాక్షసానందం పొంది.. తద్వారా చంద్రబాబు మెప్పు పొందడానికి! అవును… ఉదయం లేస్తే తెలంగాణలో అతితక్కువ కేసులు నమోదవుతున్నాయి… ఏపీలో మాత్రం తెగ పెరిగిపోతున్నాయి… దీనికి వైకాపానేతల అత్యుత్సాహం, జగన్ చేతకానితనం, ఐఏఎస్, ఐపీఎస్ ల అలసత్వం కారణం అంటూ తెగ స్టోరీలు ప్రసారం చేసేస్తున్నారు… విత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్! కానీ… అసలు ఎన్ని టెస్టులు చేస్తే ఈ నెంబర్ వస్తుంది? ఇది మంచి పరిణామమా… కాదా? టెస్టులు తక్కువ చేసి, తద్వారా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా చూపించి… ఆత్మవంచన చేసుకోవడం మంచిదా?

ఆ ఆలోచన జగన్ చేయలేదు… టెస్టుల సంఖ్య పెరిగితే కేసుల సంఖ్యలు పెరుగుతాయి… దీంతో అజ్ఞానంతో ప్రతిపక్షం.. రాక్షసానందంతో ఒక వర్గం మీడియా రకరకాల వక్రబాష్యాలు చెబుతూ.. నిజాలను జనాలకు చెప్పవని తెలిసినా… వీలైనంత తొందరగా రాష్ట్రం మొత్తం జల్లెడపట్టి… అధిక సంఖ్యలో టెస్టులు చేయడం వల్ల తొందరగా ఈ మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చని జగన్ ఆలోచించారు! అందులో భాగంగా వేల సంఖ్యలో టెస్టులు చేస్తున్నారు… ఫలితంగా ప్రతి రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణతో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తున్నాయి… దీంతో పిల్ల చచ్చిన కోతిలా వాళ్లు గంతులేస్తూ.. జనాలకు వాస్తవాలు చెప్పకుండా వక్రబాష్యాలు చేస్తున్నారు!

ఉదాహరణకు… తెలంగాణలో 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆంధ్రలో 62 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో అరాచకం మొదలైపోయింది. అదిగో తెలంగాణలో తగ్గుముఖం పడుతుంటే.. ఏపీలో రోజు రోజుకీ కేసుల సంఖ్యలు పెరిగిపోతున్నాయి అని! కాస్త లోతుకెళ్లి పరిశీలిస్తే… తెలంగాణలో తాజాగా నమోదైన 13 కేసులు.. 500 లకు పైగా టెస్టులు చేయడం వల్ల రాగా…. ఏపీలో 62 కేసులూ 6000కు పైగా టెస్టులు చేయ్యడం వల్ల వెలుగులోకి వచ్చినవి!

పోనీ తెలంగాణ సగటుతోనే పోల్చి చూసుకుంటే… 500పై చిలుకు టెస్టులకు 13 అయినప్పుడు… 6000 టెస్టులకు 150 వరకూ పాజిటివ్ రావాలి… కాని వచ్చింది 62! ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉంటుందా? ఈ వేసవి సీజన్ ముగిసేలోపు… అవకాశం ఉన్న మేరకు వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేసేసుకుని… క్లారిటీ తెచ్చేసుకుంటే… రాష్ట్రాలు, తద్వారా దేశం తొందరగా కోలుకునే పరిస్థితి ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం.. అదే జగన్ చేస్తున్నారు నిత్యం! అందుకని రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది… రాష్ట్రం కరోనా భారిన పడిపోతుంది అని ఆందోళన చెందకుండా… టెస్టుల సంఖ్య పెరగడం వల్ల ఈ రోజు కాస్త భయ్యాందోళనగా అనిపించినా… ముందుగా సేఫ్ జోన్ లోకి వెళ్లి లాక్ డౌన్ నుంచి వెలుగులోకి వచ్చేది ఏపీనే అవుతుందని మరిచిపోకూడదు!

ఈ వాస్తవాలు ప్రజలు గ్రహిస్తారని.. ఈ వార్త చదివిన తర్వాత అయినా… ఏపీ వాసులు భయబ్రాంతులకు గురవకుండా… ఇది జరుగుతుంది తమ మంచికే అని గ్రహిస్తారని.. ఇలాంటి కష్ట సమయంలో కూడా కుళ్లు రాజకీయాలు చేస్తున్నవారు ఇకనైనా ప్రజలకు వాస్తవాలు చెబుతూ… ధైర్యం చెబుతారని ఆశిద్దాం!

Read more RELATED
Recommended to you

Latest news