నేడు, అమరావతిలో జాతీయ మహిళా కమీషన్…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఇన్నాళ్ళు రైతులు మాత్రమే పూర్తి స్థాయిలో ఉద్యమించారు. కాని ఇప్పుడు వారికి తోడుగా మహిళలు కలిసారు. పూర్తి స్థాయిలో మహిళలు అమరావతి కోసం పోరాటం చేస్తున్నారు. శుక్రవారం విజయవాడ మొత్తం మహిళలతో రణరంగంగా మారిపోయింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మహిళలు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసారు.

దీనితో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై తమ ప్రభావం చూపించారు. మొన్నీ మధ్య కూడా ఇదే విధంగా పోలీసులు మహిళలపై తమ ప్రభావం చూపించారు. దీనితో దీనిపై పలువురు జాతీయ మహిళా కమీషన్ కి ఫిర్యాదు చేసారు. దీనితో జాతీయ మహిళా కమీషన్ రంగంలోకి దిగింది. ఈ నేపధ్యంలోనే, జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖాశర్మ నేతృత్వంలోని ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ (నిజ నిర్ధారణ బృందం) శనివారం అమరావతిలో పర్యటిస్తుంది.

ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్ట౦ చేసారు. మహిళలపై పోలీసులు చేస్తున్న దాడులకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించనున్నారు. అదే విధంగా కొన్ని వీడియో ఫూటేజ్ లను కూడా పరిశీలించడమే కాకుండా రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ని కలిసే అవకాశ౦ ఉందని అంటున్నారు. శనివారం జరిగిన పరిణామాలపై తెలుగుదేశం నేతలు జాతీయ మహిళా కమీషన్ కి ఫిర్యాదులు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news