బ్రేకింగ్‌: మ‌రోసారి క్షీణించిన బంగారం ధ‌ర‌.. ఇదే బాట‌లో వెండి..

-

నిన్న భారీగా ప‌తన‌మైన బంగారం ధ‌ర ఈ రోజు మ‌రో సారి క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర భారీగా పతనమైంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.370 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.37,930కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే కేవలం రూ.10 మాత్రమే తగ్గడం గమనార్హం. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.41,780కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.400 పడిపోయింది. దీంతో ధర రూ.49,500 నుంచి రూ.49,100కు దిగొచ్చింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.400 క్షీణించింది. దీంతో ధర రూ.39,100 నుంచి రూ.38,700కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 క్షీణించింది. దీంతో ధర రూ.39,900కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.400 దిగొచ్చింది. దీంతో ధర రూ.49,100కు క్షీణించింది.

Read more RELATED
Recommended to you

Latest news