ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకొంటారు. విద్య, ఆరోగ్యం, పోషకాహార రంగాలలో బాలికల గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు జరుపుకుంటారు. భారత ప్రభుత్వం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిజానికి బాలికలు అనేక శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత శారీరక మార్పులకు లోనవుతారు. పోషకాహార లోపంతో బాధపడే మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. బాలికల ఆరోగ్యం చూసుకునేందుకు కొన్ని పరీక్షలు తరచూ చేయించుకోవాలి.ఇంకో రెండు రోడుల్లో జాతీయ బాలికా దినోత్సవం ఉంది కాబట్టి.. మీ పిల్లలకు ఈ పరీక్షలు కచ్చితంగా చేయండి.
బాలికల్లో రక్తహీనత సర్వసాధారణం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష చేయించాలి. ఈ పరీక్ష ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్ కౌంట్ గురించి పూర్తి సమాచారం ఇస్తుంది. రక్తహీనత, అంటువ్యాధులు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో సహా అనేక ఆరోగ్య పరిస్థితులను CBC పరీక్ష నిర్ధారిస్తుంది. అలసట, బరువు తగ్గడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలను ఎదుర్కొంటున్న వారికి, CBC పరీక్షను చేయడం అనేది మంచిది.
ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు వస్తాయి. శరీరం తగినంత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు రక్తహీనత సాధారణంగా వస్తుంది. సరైన ఆహారం, ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ స్థాయిలను క్రమం తప్పకుండా చూసుకోవడం వల్ల ఈ పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఐరన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి.
విటమిన్ ప్రొఫైల్ పరీక్ష కూడా బాలికలకు అవసరం. విటమిన్ D, B12 మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలపై ప్రభావం పడుతుంది. విటమిన్ B12 తక్కువ స్థాయిలో ఉంటే అది రక్తహీనతకు కారణమవుతుంది. కండరాల బలహీనత, అలసట, ఎముక వైకల్యాలు, నొప్పిని ఎదుర్కొంటున్న వారి కోసం విటమిన్ స్థాయిలను తనిఖీ చేయాలి.
మైక్రో యూరినాలిసిస్ అనేది మూత్రంలో సూక్ష్మజీవులను గుర్తించే పరీక్ష. మూత్రంలోని మైక్రోస్కోపిక్ భాగాలను మూల్యాంకనం చేసే ఒక రోగనిర్ధారణ పద్ధతి ఇది. కడుపు నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మూత్రంలో రక్తం, మండడం వంటి లక్షణాలు ఉన్నవారు మూత్ర పరీక్ష చేయించుకోవాలి.
బాలికల్లో యుక్తవయస్సు ఆలస్యమైతే, హార్మోన్స్ మీద ప్రభావం ఉంటుంది. హార్మోన్స్ పరీక్ష పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, థైరాయిడ్ పనిచేయకపోవడం, పునరుత్పత్తి ఆరోగ్యం, అడ్రినల్ గ్రంథి పనితీరును నిర్ధారించడంలో సహాయపడుతుంది. మీ హార్మోన్ల ఆరోగ్యం రుతుక్రమం లోపాలు, హార్మోన్ల రుగ్మతల వంటి పరిస్థితులను నిర్వహించడంలో మీకు ఉపయోగపడుతుంది. బాలికలు ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగానూ, శరీరకంగానూ ఎదుగుతారు.
కంటి పరీక్ష చేయించుకోవడం వల్ల.. దగ్గరి చూపు, దూరం చూపును అంచనా వేయడానికి, ఆప్టిక్ నరాలు, లెన్స్‌ల ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. సరైన దృష్టి కోసం బాలికలకు ఇది ఉపయోగపడుతుంది.