సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..కారణం ఇదే

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు), మాణిక్ రావు (జహీరాబాద్) కలిశారు.

Four BRS MLAs meet Chief Minister Revanth Reddy, termed it as courtesy call

అయితే.. ఈ సమావేశం అనంతరం…సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. అభివృద్ధి కోసమే కలిశాను..ఈ అంశంపై అనవసరంగా ఊహగానాలు సృష్టించవద్దని కోరారు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.

ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో నేను అలానే కలిశానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానంలో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version