ఆర్టీపీపీపై ఎన్జీటీ విచారణ… ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

-

చెన్నై: రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై ఎన్జీటీ విచారణ చేపట్టింది. గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో శుక్రవారం విచారణ జరిగింది. ప్రాజెక్టు సందర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతివ్వడంలేదని హైకోర్టులో కేఆర్ఎంబీ అఫిడవిట్ దాఖలు చేసింది. కేఆర్ఎంబీ అఫిడవిట్‌పై వివరణ ఇస్తామని ఎన్జీటీకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు సందర్శనకు పంపించాల్సిన అవసరం లేదని పేర్కొంది. తామే అక్కడి పరిస్థితులను వివరిస్తూ సమాధానం ఇస్తామని తెలిపింది. డీపీఆర్ తయారీకి అధ్యయనం మాత్రమే చేస్తున్నామని వెల్లడించింది. పర్యావరణశాఖ, కేంద్ర జలసంఘం అడిగిన అంశాలపై అధ్యయనం చేస్తున్నామని ఎన్జీటీకి స్పష్టం చేసింది.

అయితే ఎన్జీటీ బృందం ప్రాజెక్టును సందర్శించాలని తెలంగాణ అదరనపు ఏజీ ఎన్జీటీని కోరింది. హెలికాప్టర్, సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. దీంతో ఏపీతో సంబంధం లేకుండా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఎన్జీటీ ఆదేశించింది. కృష్ణా బోర్డు నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని ఈ సదర్బంగా ఎన్జీటీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి పనులు జరుపుతారని భావించట్లేదని తెలిపింది. ఏపీ ఉల్లంఘనకు పాల్పడితే తగిన చర్యలు తప్పవని ఎన్జీటీ హెచ్చరించింది. విచారణకు ఆగస్టు 9కి వాయిదా వేసింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news