ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

-

అమరావతి : ఆగస్టు నెల 16 నుంచి పాఠశాలల పున : ప్రారంభం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాడు -నేడు సమీక్ష లో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత నాడు- నేడు పనులను కూడా అదే రోజు ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్.

ఆరోజే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు వివరించనుంది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడా వచ్చే నెల 16 నుంచి అందజేయనుంది ఏపీ విద్యా శాఖ. అయితే పాఠశాలల పున : ప్రారంభం నేపథ్యంలో అన్ని కరోనా మహమ్మారి నియమ నిబంధనాలు పాటించాలని  అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు మరియు బౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news