అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సేవల్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవల్ని మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను పొడిగిస్తున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.
జూన్ 2021 నుంచి ఓ పది రోజుల పాటు కాంట్రాక్టు లెక్చరర్ల సేవలకు విరామం ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది ఏపీ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ. ఏపీ సర్కార్ తాజాగా నిర్ణయం పట్ల లబ్ది దారులైన కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.