జాతీయ మీడియా సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది చంద్రబాబు కి !

-

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ చౌదరి దగ్గర ఐటి అధికారులు నిర్వహించిన దాడుల్లో 2 వేలకోట్లు బయటపడటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ఇదే తరుణంలో ఏపీ మీడియా వర్గాల్లో ఐటీ దాడుల గురించి గంట గంటకి సరికొత్త వార్తలు బయటకు వస్తున్నాయి. Image result for chandrababu shock

దీంతో కేంద్ర పరిధిలో జరిగిన దాడులు కావటంతో ఈ విషయం జాతీయ మీడియా వర్గాల్లో కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది. వస్తున్న వార్తలను బయటపడిన అక్రమ ఆస్తులను ప్రసారం చేస్తున్న జాతీయ మీడియా సరికొత్త ట్విస్ట్ చంద్రబాబుకి ఇచ్చింది. అదేమిటంటే చంద్ర‌బాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ వ‌ద్ద భారీ ఎత్తున అక్ర‌మాస్తులను ఐటీ శాఖ గుర్తించిన నేప‌థ్యంలో.. ఈ వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు స్పంద‌న తీసుకోవాల‌ని జాతీయ మీడియా వ‌ర్గాలు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాయ‌ట‌.

 

దీనిలో భాగంగా ఓ జాతీయ మీడియా సంస్థ చంద్రబాబు వాయిస్ తీసుకునే ప్రయత్నం చెయ్యాలని ప్రయత్నించగా చంద్రబాబు కనీసం సదరు మీడియా ఛానల్ ఫోన్ కాల్ కి కూడా స్పందించలేదట. అంతేకాకుండా ఆ మీడియా వర్గం మెయిల్ కూడా పెట్టగా దాని నుండి కూడా చంద్రబాబు స్పందించలేదని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. దీంతో చంద్రబాబుకి ఐటీదాడుల ఫీవర్ పట్టుకుందని సదరు జాతీయ మీడియా సంస్థ తన కథనాలతో సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది. 

Read more RELATED
Recommended to you

Latest news