అమరావతి రాజధాని విషయంలో జగన్ వ్యవహరిస్తున్న దూకుడు శైలికి జాతీయ మీడియా కళ్లెం వేసే టట్లుగా మెలికలు పెట్టే విధంగా కథనాలు ప్రసారం చేస్తున్న తరుణంలో వైసీపీ పార్టీలో టెన్షన్ నెలకొన్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అమరావతి చుట్టూ తిరుగుతున్న తరుణంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సందర్భంలో అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా గుర్తిస్తున్నట్లు తెలపడం జరిగింది. అయితే అప్పుడు మద్దతిస్తున్నట్లు తెలిపిన జగన్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం తో అమరావతి ప్రాంతంలో గొడవలు సృష్టించే విధంగా అధికారంలోకి వచ్చాక నిర్ణయాలు తీసుకోవడంతో జగన్ వ్యవహరిస్తున్న వ్యవహారశైలిపై తీసుకుంటున్న నిర్ణయాల పై జాతీయ మీడియా తీవ్రస్థాయిలో ఫైర్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యధిక మెజార్టీ జగన్ కి ఇస్తే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వికేంద్రీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఇష్టానుసారం అయిన పరిపాలన చేస్తున్నారని జాతీయ స్థాయి మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.
దీంతో జాతీయ స్థాయిలో ఉన్న కేంద్ర పెద్దలు జగన్ వ్యవహారశైలిపై దూకుడు నిర్ణయాలపై సీరియస్ అవుతున్నట్లు…ఏ మాత్రమైనా ఏపీలో కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో తనదైన శైలిలో జగన్ ఇరుకున పెట్టే విధంగా ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అనే టాక్ ప్రస్తుతం వినబడుతుంది.