చెన్నై ఎయిర్ ఫోర్టులో కస్టమ్స్ అధికారుల సోదాలు.. 13.5 కిలో బంగారం సీజ్..!

-

ఇతర దేశాలను నుంచి దేశంలోకి అక్రమంగా బంగారం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతోందని ఇటీవల కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం అన్ని రాష్ట్రాల పోలీసులు, కస్టమ్స్ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ క్రమంలోనే స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, పోర్టు వద్ద పోలీసులు విస్తృతంగా తనఖీలు చేపడుతున్నారు.

ఈ దాడుల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకుని స్మగర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సింగపూర్ నుంచి చెన్నెకి అక్రమంగా తరలిస్తున్న 13.5 కిలోల బంగారు బిస్కట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శ్రీలంక ప్రయాణికుడు, ఇద్దరు విమానయాన సంస్థ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.8.5 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news