వరదలు : కుటుంబానికి 25 వేలు ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం

బెంగళూరులో భారీ వర్షాల వలన చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన కర్నాటక సీఎం బెంగళూరులో వరదలతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. వర్షంలో దెబ్బతిన్న కొన్ని ప్రాంతాలను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయన వెంట బిబిఎంపి కమిషనర్ ఎన్ మంజునాథ ప్రసాద్, బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ లు ఉన్నారు.

ఇక నగరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలు లానే మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఇలానే వరదలు హైదరాబాద్ లో రాగా ఒక్కో కుటుంబానికి అక్కడి సీఎం కేసిఆర్ పది వేల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. అయితే ఏపీలో మాత్రం కేవలం 500 ప్రకటించడం సంచలనంగా మారింది.