దేశంలో బీహారు ఒక్కటే ఉందా.. బీజేపీ పై విమర్శలు..?

ప్రస్తుతం బీహార్ ఎన్నికల వేడి రాజుకుందన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి బిజెపి ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు చేరి హామీల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇటీవల బీజేపీ ఇచ్చిన ఒక హామీ కాస్త ప్రస్తుతం బీజేపీకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని మంచి మెజారిటీతో గెలిపిస్తే రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగానే ఇస్తానంటూ ఇటీవలే బిజెపి ప్రజలందరికీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. కరోనా వైరస్ టీకా ఇంకా ప్రజలకు అందుబాటులోకి రానే లేదు అప్పుడే ప్రజలకు ఎలా ఇస్తారు అని బీహార్లో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటే… బీజేపీ కీ కేవలం బీహార్ రాష్ట్ర ప్రజలు మాత్రమే ప్రజల్లా కనిపిస్తున్నారా మిగతా వాళ్ళందరూ పాకిస్తాన్ ప్రజల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాయి మిగతా రాష్ట్రాలు.