కరోనా : యాంటీబాడీలు శరీరంలో ఎన్ని రోజులు ఉంటాయంటే..?

-

ప్రస్తుతం కరోనా వైరస్ అన్ని దేశాలను పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కరోనా వైరస్ గురించి మరిన్ని నిజాలు తెలుసుకొని ప్రజలందరికీ అవగాహన పెంచేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే పరిశోధకులు కరోనా వైరస్ సోకి కోలుకున్న వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఎన్ని రోజుల వరకు యాక్టివ్ గా ఉంటాయి అనే విషయం తెలుసుకునేందుకు పరిశోధనలు జరిపారు. పరిశోధకుల అధ్యయనంలో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోర్చుగల్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మాలిక్యులర్ సంస్థ పరిశోధకులు ఒక మనిషి శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎన్ని రోజుల వరకు యాక్టివ్ గా ఉంటాయి అనే దానిపై అధ్యయనం జరిపారు. శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఏడు నెలల వరకు యాక్టివ్గా ఉండే అవకాశం ఉందని ఈ పరిశోధనలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపుగా కరోనా వైరస్ బారి నుంచి తొంభై శాతం మందిలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఏడు నెలల వరకు యాక్టివ్ గా ఉంటాయి అనే విషయం తెలిసింది అని చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.

Read more RELATED
Recommended to you

Latest news