షాకింగ్‌న్యూస్‌: పిడుగుపాట్లకు 28 మంది మృతి!

బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో చోటుచేసుకున్న పిడుగుపాట్లకు 28 మంది మ‌ర‌ణించారు. బీహార్‌లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాట్ల కారణంగా 15 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం ప్రకటించారు. అలాగే ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు.

అదేవిధంగా యూపీలో గడచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. వివిధ ప్రాంతాల్లో పిడుగుపాట్ల కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, పశ్చిమబెంగాల్, గుజరాత్, గోవా, కేరళ, కర్నాటకలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.