భార‌త్‌లో కరోనా బాధితుల సంఖ్య ఎంతో తెలుసా…!

భార‌త్‌లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశంలో ఈ వ్యాధి బారిపడినవారి సంఖ్య 50 లక్షలు దాటింది. ఇదేసమయంలో మృతుల సంఖ్య 82 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన తాజా వివరాల ప్రకారం దేశంలో కరోనా రోగుల సంఖ్య 50,08,878కి చేరింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 81,964 కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా కారణంగా ఇప్పటివరకూ 82,038 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9,93,075 యాక్టివ్ కేసులు ఉండగా, 39,31,356 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మంగళవారం మహారాష్ట్రలో అత్యధికంగా 20,432 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్‌లో 8,846, కర్నాటకలో 7,576, ఉత్తరప్రదేశ్‌లో 6,841, తమిళనాడులో 5,697, ఢిల్లీలో 4,263 కరోనా కేసులు నమోదయ్యాయి.