భారత ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడం ప్రపంచ రికార్డు : సీఈసీ

-

దేశ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేశారని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇంతమంది ఓటు వేయడం ప్రపంచ రికార్డు అని పేర్కొన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల (యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ జపాన్‌, కెనడా, ఇటలీ) జనాభాకు 1.5 రెట్లు అని వెల్లడించారు. మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ లేచి నిలబడి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను ఏడు విడతల్లో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. 85 ఏళ్ల పైబడిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేశారని తెలిపారు. ఎన్నికల్లో చెదురుమదురు మినహా హింసాత్మక ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. కేవలం 14 చోట్ల మాత్రమే రీపోలింగ్‌ నిర్వహించామని వెల్లడించారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం రాలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news