ఒక్కటి కూడా వదలను.. ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తా : మంత్రి పొంగులేటి

-

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నింటిని నెరవేరుస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించారు మంత్రి పొంగులేటి. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం.. న్యాయమైన కోరికలు అన్నీ నెరవేరుస్తామని తెలిపారు.

సంవత్సరంలోపు పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని.. రూ.22.5 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ఏడాదే  రోహిణి కార్తెలోనే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని పేర్కొన్నారు. అనేక కష్టాలు, నష్టాలు పడి తనను మంచి మెజారిటీతో గెలిపించారని, మీరిచ్చిన అవకాశంతోనే తాను ఈస్థాయిలో ఉన్నానని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పాలేరు నుంచి అత్యధిక మెజారిటీ రాబోతోందని చెప్పారు. గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవారికి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఓడిపోయిన విషయాన్ని మరిచి బీఆర్ఎస్ నేతలు ఇంకా అహాంకార ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news