మంగళవారం నాడు భారతదేశం మరో మైలు రాయిని దాటింది. గత 24 గంటల్లో ఎనిమిది రాష్ట్రాలు/ యూనియన్ టెరిటరీస్ లో కోవిడ్ కి సంబంధించిన ఎటువంటి మరణాలు లేవు. అదే విధంగా కేంద్రం 15 కోట్ల వాక్సిన్ డోసెస్ ని రాష్ట్రాలకు/ యూనియన్ టెర్రిటరీస్ కి ఫ్రీగా అందించింది.
గత 24 గంటల్లో ఎటువంటి మరణాలు దాద్రా నగర్ హవేలీ మరియు థమన్ అండ్ డియూ, లడక్, త్రిపుర, లక్షద్వీప్, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో లేవు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికి 15 కోట్లు పైగా వ్యాక్సిన్స్ ని పంపిణీ చేసింది. అది కూడా ఫ్రీ గా అందించింది. ఇందులో వ్యర్థాల తో సహా మొత్తం ఒక కోటికి పైగా వ్యాక్సిన్లని ఇప్పటికే రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కి పంపిణీ చేసారు. ఇది కాకుండా 80 లక్షలు పైగా వ్యాక్సిన్లని మరో మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నారు.
గత 24 గంటల్లో 3.23 లక్షల కేసులు నమోదయ్యాయి. అదే విధంగా 2700 కి పైగా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 2,51,827 రికవరీలు కూడా నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ సహా పది రాష్ట్రాల్లో కొత్త కేసులు 71.68 శాతం నమోదయ్యాయి.
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 895 కోవిడ్ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అధికంగా మరణాలు ఈరోజే చోటు చేసుకున్నాయి. పంజాబ్‌లో 5,932 కొత్త COVID19 కేసులు, 100 మరణాలు మరియు 3,774 డిశ్చార్జెస్ నమోదయ్యాయి.
కర్ణాటకలో తాజాగా 31,830 కేసులు, 180 మరణాలు, 10,793 డిశ్చార్జెస్ నమోదయ్యాయి.ఇది ఇలా ఉండగా గుజరాత్ లో కూడా గత 24 గంటల్లో 14,352 కొత్త COVID19 కేసులు, 170 మరణాలు మరియు 7,803 డిశ్చార్జెస్ నమోదయ్యాయి.